Header Banner

RTC ప్రయాణికులకు శుభవార్త! వాట్సప్‌తో టికెట్ బుకింగ్ ఇప్పుడు అందుబాటులో!

  Sun Feb 02, 2025 10:04        Travel

రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సప్ ఆధారిత సేవల్లో భాగంగా ఆర్టీసీ బస్ టికెట్లను.. వాట్సప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దూరప్రాంత బస్ సర్వీసులు అన్నింటా వాట్సప్ ద్వారా టికెట్ బుకింగ్కు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు, డిపో మేనేజర్లకు ఆదేశాలిచ్చింది. వాట్సప్లో టికెట్ బుకింగ్ ఇలా.. వాట్సప్ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సేవల్లో భాగంగా.. 9552300009 నంబరుకు తొలుత హాయ్ అని మెసేజ్ పంపాలి.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!  


ఆ తర్వాత ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. అందులో ఆర్టీసీ టికెట్ బుకింగ్ / రద్దు అనేది ఎంపిక చేసుకోవాలి. అందులో బయలుదేరే ప్రదేశం, గమ్యస్థానం, తేదీ వంటివన్నీ టైప్ చేస్తే.. ఏయే సర్వీసులు అందుబాటులో ఉన్నాయి, సీట్ల వివరాలు చూపిస్తుంది. వీటిలో సీట్లు ఎంపిక చేసుకొని ఆన్లైన్, డిజిటల్ చెల్లింపులు చేస్తే సరిపోతుంది. వెంటనే బుకింగ్ చేసుకున్న వ్యక్తి వాట్సప్ నంబరుకు టికెట్ వస్తుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #whatsapp #ticketbooking #APSRTC #todaynews #flashnews #latestupdate